హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్ పోటీస్ కమిషనర్‌ను ఆదేశించింది. మహిళను అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపిన ఘటన చాలా బాధాకరమని చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని కార్యాలయం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి ఘటనపై మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను చైర్ పర్సన్ సునిత లక్ష్మారెడ్డి ఆదేశించారు.




