నాకు ఒక అవకాశం ఇవ్వండి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో, ఎమ్మెల్యే జాబుకు అప్లికేషన్ పెట్టుకుని, మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రుజువు చేస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గ  అభ్యర్థి మధుయాస్కి అన్నారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరులతో సమావేశం లో మాట్లాడారు. హయత్ నగర్ వాసిని అయిన నేను విదేశాల్లో ఉండి తిరిగి భారతదేశం వచ్చాక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఆదేశాలు మేరకు నిజామాబాద్ వెళ్లడం జరిగిందన్నారు.  నిజామాబాద్ ఎలా అబివృద్ది చేసానో అక్కడి ప్రజలకు తేలుసు 2014లో కాంగ్రెస్ పార్టీ ఒడిపోయిప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీని వీడకుండా పార్టీ బలపరచడం జరిగిందన్నారు.  ఈప్రాంత ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ వెన్నుపోటు దారుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.  ఇతను సొంత పార్టీ నేతలపై దాడులు కబ్జాలు చేస్తూ, సామాన్య ప్రజలకు చెందవలసిన సి.ఎం రిలీఫ్ ఫౌండ్ ను కాజేసి నీతి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రెండుసార్లు ఎల్బీనగర్ అధికార పార్టీ బి.ఆర్.ఎస్ ను వ్యతిరేకించిందని  నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నారు. లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తిని నేను, కుటుంబ బాధ్యతలు ఎలా నెరవేర్చాలో ఎల్బీనగర్ కూడా నాకుటుంబమేనని అన్నారు. మూసి నుండే వెలువడే దుర్వాసన వల్ల అనేక రోగాల బారిన పడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆర్.కృష్ణయ్య హయాంలో ఎల్బీనగర్ అభివృద్ధి అయింది కానీ స్థానిక ఎమ్మెల్యే చేసింది ఏమి లేదన్నారు. గొలుసుకట్టు చేరివు కింద సరూర్ నగర్ చెరువులో నీళ్లు చేరి సెప్టిన్ ట్యాన్క్ ల మార్చారు. బి.ఎన్.రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్య అలాగే ఉంది అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉంటా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నూతన స్కిల్ సెట్ ట్రినింగ్ ఇప్పించి మధుయాష్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్థానని అన్నారు. ఎల్బీనగర్ ఓటర్లు అత్యధిక మెజారితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మధుయాష్కీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *