జీవితం
వొక శిల అయిపోయిందని
వొరిగిపోకు
ఇప్పుడే
ఆశల వులుల
కలకలం మొదలైంది
అది శిల్ప పరిమళాలతో
వికసించడానికి…
సంకల్పం
వొక బిందువే అని
క్రుంగిపోకు
ఇప్పుడే
ఆలోచనల జలాల
ప్రవాహం ప్రారంభమైంది
అది సింధువై
ఆశయాల అలలతో
వుప్పొంగడానికి…
నేస్తం!
సమైక్యతాసూర్యుడు
సరికొత్త
సామాజిక కిరణాలతో
జగతిని
జాగృతం చేయడానికి
అలుముకున్న
అలజడుల తిమిరాలు
తొలగిపోవడానికి
నీలోని సామరస్యం
వొక నవోదయమై
వెలిగిపోవాలి…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర , 9177732414




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల