నల్ల చీరలతొ అంగన్వాడీల నిరసన

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 15వ  రోజు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు  నల్ల చీరలు ధరించి తాండూరు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించి అనంతరం  మండల కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినపత్రం ఇచ్చారు. ఈ ఈ సందర్భంగా సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఐసిడిఎస్  సిడిపిఓ సూపర్వైజర్  అధికారులు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పై బెదిరింపులు వేధింపులు అరికట్టాలని సిడిపిఓ  సూపర్వైజర్లను వెంటనే సస్పెండ్ చేయలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల పైన హెల్పర్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా  రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు రెండు లక్షల 50 వేలు జీతం ఇస్తున్నారని, అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయకుండా వెట్టిచాకి చేయించుకుంటూ వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు.  అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000/- చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు 10 లక్షలు, హెల్పర్ కు 5 లక్షలు ఇవ్వాలని, చివరి జీవితంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడిలపై అధికారులు అనేక రకాల వేధింపులు భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని సూచించారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని అన్నారు. 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనాన్ని టీచర్లకు 1500 , హెల్ప్ ర్   లకు 750, మినీ టీచర్లకు 1250 రాష్ట్రప్రభుత్వం ఏరియాస్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తాండూర్ ప్రాజెక్టు అధ్యక్షులు భేబి కార్యదర్శి సుధారాణి ఉపాధ్యక్షులు బాలమణి శశికళ శోభ రామంజమ్మ రాధా మనిమాల లక్ష్మి సరస్వతి రమాదేవి లలిత అంజమ్మ సహాకార్యదర్శులు తిరుమలమ్మ  హారతి చంద్రకళ మారుతమ్మ సంధ్య రాణి సవిత పద్మ వసంత వాణి అంజమ్మ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నర్సమ్మ సంధ్యా భారతి విజయలక్ష్మి శ్యామల శాంత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *