నమ్మేటోడు లేడు..భయపడెటోడు లేడు

  • 11.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిందే
  • ఇల్లందు కాంగ్రెస్‌కు అడ్డా
  • ఙతీవ•ఎస్‌ ‌నాయకులవి మొసలి కన్నీళ్లు
  • ఇల్లందు హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : సిరుల తల్లి సింగరేణికి ఇల్లందు పుట్టినిల్లు అని ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా భూగర్భ గనులను మూసేస్తూ ఓసీలను కనీసం రెండు వేలమంది కార్మికులు కూడా పనిచేయని దుస్థితి నెలకొందన్నారు. అందుకే ఉదయం గనులను సందర్శించానని సింగరేణిలో ఎన్నో సమస్యలు, అవినీతి పేరుకుపోయిందన్నారు. ఎక్కడి ఎల్లినా సమస్యల వెల్లువ కొనసాగుందని చెప్పారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో భాంగంగా శనివారం ఇల్లందులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సైతం భూముని దున్నుకుంటుంటే రాష్ట్రపతి నుండి లేఖ వొచ్చినా ఓ అధికారి తప్పుడు పత్రాలతో ఆ రైతు నోరు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళు లేవని తమకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి గూడు కల్పించాలని కోరినట్లు తెలిపారు. తండాలలో కనీస ఆదివాసీ ఆడబిడ్డ అసెంబ్లీతో ఆదివాసీల సమస్యలపై గొంతు విప్పితే నిరంకుశ పాలకులు ఒంటి కాలిపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే సబ్బండ వర్గాలకు భరోసా ఇచ్చేందుకు హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర చేపట్టామని వెల్లడించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్టు అధికారులకు, పోడు రైతులకు తగాదా పెట్టి కెసిఆర్‌ ‌కుటుంబం తమాషా చూస్తున్నదని చెట్లకు చీరలతో కట్టేసి కొడుతుంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క అండగా నిలిచారని, పోడు రైతులకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు. అర్హులైన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇస్తామని తొమ్మిది ఏళ్ళ నుండి కాలయాపన చేస్తూ ఆదివాసీ ఆడబిడ్డలను ఎలా చెట్లకు కట్టేశారో అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్‌ ‌సభకు పోతే పట్టాలు ఇవ్వమని బెదిరిస్తున్నారని, కానీ వోట్ల కోసం తండాలకు, గూడాలకు బిఆర్‌ఎస్‌ ‌నేతలకు చెట్లకు కట్టేయండని పులుపునిచ్చారు. పట్టాలు ఇచ్చి నాయకులను విడిపించుకు పోవాలని చెప్పాలని ప్రజలను కోరారు. కెసిఆర్‌ ‌ప్రకటనను నమ్మేవారు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఎద్దేవ చేశారు. సిఎం కెసిఆర్‌కు గద్వేల్‌లో ఉన్న వెయ్యి ఎకరాలలో ఉన్న ఫామ్‌ ‌హౌజ్‌లో గుంట భూమి అడిగారా…లేక దోచుకున్న ప్రజా ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు అడిగారా అని ప్రశ్నించారు.

తరతరాలుగా కూటి కోసం పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు పోడు భూములు ఇవ్వకుండా దాడులు చేపిస్తు బిఆర్‌ఎస్‌ ‌నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని అడ్డు పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు పాల్పడుతున్నారని, దీన్ని సహించబోమని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌రాక స్కాలర్‌షిప్‌లు అందక నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. నిరు పేద విద్యార్థులకు రూ 5 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌కూడా కాంగ్రెస్‌ ‌చెల్లిస్తుందన్నారు. పేద రైతులకు రూ 2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఇల్లందులో ఏ దందాలు, చందాలు, కమీషన్‌లు అయినా ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌ ‌కనుసన్నుల్లోనే నడుస్తున్నాయని పరోక్షంగా విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రారంభానికి అప్పుడు దీక్షలు చేపట్టి పార్టీ మారి కెసిఆర్‌ ‌గడీలో గడ్డి కరుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంతో మంది గిరిజన యువకులకు ఉపాధి కోల్లోయాని, నిర్మించి ఉంటే 30 వేల మంది యువతకు ఉపాధి లభించేదని ఆవేదన చెందారు.

దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ అన్నారు. కరెంటు లేక రైతులు రోడ్డు ఎక్కుతున్నారని, చేతికొచ్చిన మిర్చీ పంటలు కరెంటు లేక పొలాలకు నీళ్ళు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్‌దే అన్నారు. కార్పొరేట్‌ ‌స్థాయిలో విద్యకూడా అందిస్తామని ప్రజలు అందరూ అభయ హస్తాన్ని ఆదరిస్తే మీకు అండగా కాంగ్రెస్‌ ‌నిలుస్తుందన్నారు. పోరాటం కొనసాగుతుందని అందుకు పోడు రైతులకు అండగా కాంగ్రెస్‌ ‌నిలుస్తుందని హామీ ఇచ్చారు. జనభా ప్రతిపాదికన రిజర్వేషన్‌లు పెంచుతామన్నారు. కోయలు, చెంచులు, వాల్మీకిలు కెసిఆర్‌ ‌మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించినా కేంద్రం అడ్డుకుందని కెసిఆర్‌ ‌ప్రభుత్వం సాకులు చెబుతుందన్నారు. లక్ష్మణ్‌ ‌నాయక్‌ ‌కోర్డుకు పోయి ఆదేశాలు తెచ్చినా 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ఒక్క కోయ కూడా శాసన మండలిలో లేరని కెసిఆర్‌ 6‌శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్‌ను జివో 3 ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. వొచ్చే ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్తి భారీ మెజారీటీతో గెలిపించాలన్నారు.

ఇదిలా ఉండగ మహుబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, అమె భర్త హరిసింగ్‌, ‌పినపాక ఎమ్మెల్యే రేగకాంతరావులు చేస్తున్న ఆవినీతి ఆరాచాకాలను ప్రజల ముందుకు తీసుకోని పోయ్యేదుందుకు ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేసారు. శంకర్‌నాయక్‌ ‌భూకబ్జాలను అడ్డుకోని మహబూబాబాద్‌ను రక్షించుకోవాలని, ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ, అమె భర్త అవినీతి, బొగ్గు దోపిడి, అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు, బెదరింపులనుండి ఇల్లందు నియోజవర్గాన్ని కాపాడుకోవాలన్నారు. ఇక పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు పాల్పడుతున్న ఇసుకు దోపిడి, కమీషన్‌ల వసూళ్ళకు సంబంధింన కరపత్రాలను ప్రజల ముందకు తీసుకోని వెళుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పేరిట పార్టీ మారిన ఎమ్మేల్యే హరిప్రి ఉక్కు ఫ్యాక్టర్టీ ఎక్కడ నిర్మించారలో తెలపాలన్నారు.

కేవలం తన సొంత అస్తులను పెంచుకునేందుకు కట్టుకునేందుకే పార్టీ మారిందని ప్రజులు గుర్తించాలన్నారు.భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని అదరించవద్దన్నారు. ఇక నాలుగు రోజుల క్రితం డోర్నకల్‌లో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పై అవాక్కులు చవాకులు చేస్తున్న ఏమ్మెల్యే రెడ్యానాయక్‌ ‌నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాజకీయ బిక్షపెట్టిన పార్టీని వీడిన నువ్వు కాంగ్రెస్‌ ‌పార్టీని, రేవంత్‌రెడ్డి విమర్శస్తావా అంటు మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ ఆనాటీ నాయకులేనన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ‌నాయకులు చెరుకు సుధాకర్‌, ‌భూక్య ధళసింగ్‌, ‌డాక్టర్‌ ‌రామచందర్‌నాయక్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *