నగరంలో నేడు ఐఏయూ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2023

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 4 : భారత దేశంలో తొలిసారిగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఐఏయూ 50 కి.మీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2023, ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 అనే రెండు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని ఎన్ఈబీ స్పోర్ట్స్ ప్రతినిధులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు ఈవెంట్లు ఆదివారం జరగనున్నాయని తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు 50 కి.మీ రన్ ను పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ రన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్(ఐఏయూ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) సహకారంతో ఎన్ఈబీ స్పోర్ట్స్ నిర్వహించే రన్ లో అమెరికా, జర్మనీ, స్పెయిన్, దక్షిణాఫ్రికా, క్రొయేషియా, జపాన్, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, భారత్ సహా 22 దేశాలకు చెందిన 150 మందికి క్రీడాకారులు పైగా పాల్గొంటారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *