నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

  • 13 ‌యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్ల సృష్టి
  • నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : అం‌తర్‌ ‌రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్‌ ‌తయారీ ముఠాను బషీర్‌ ‌బాగ్‌ ‌సౌత్‌ ‌జోన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారని సెంట్రల్‌ ‌జోన్‌ ‌డీసీపీ రాజేష్‌ ‌చంద్ర తెలిపారు. ఇప్పటికి 30 మందికి ఈ సర్టిఫికేట్లను అందించారని గుర్తించామన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ ‌దందా చెలామణి చేస్తున్న నాలుగు ముఠా సభ్యులను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్‌ ‌చంద్ర తెలిపారు.

కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్‌ ఆపరేటర్స్?‌తో కుమ్మకై ఈ దందా చెలామణి చేస్తున్నారని వెల్లడించారు. ఎవరికైతే నకిలీ సెర్టిఫికెట్‌ అవసరం ఉన్నదో వాళ్ళను ఆసరా చేసుకుని.. ఈ రాకెట్‌ ‌టీమ్‌ ‌చెలామణి అవుతోందన్నారు. నిందితులపై హైదరాబాద్‌లోని పలు పోలీసుస్టేషన్‌లలో చీటింగ్‌ ‌కేసులు నమోదయ్యాయయని డీసీపీ రాజేష్‌ ‌చంద్ర చెప్పారు. అన్నా యూనివర్సిటీతో గో డాడీ వెబ్‌ ‌సైట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్‌ ‌సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజలెవరూ ఇలాంటి నకిలీ సర్టిఫికెట్స్?‌కు ప్రలోభ పడవద్దని డీసీపీ రాజేష్‌ ‌చంద్ర కోరారు. నకిలీ సెర్టిఫికెట్స్ ‌ద్వారా ఎలాంటి ఉద్యోగం పొందినా..

తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక్కొక్క సెర్టిఫికెట్‌కు నిందితులు రూ.50వేల నుంచి 1లక్ష వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. నిందితులు మొహమ్మద్‌ ఏతేషాం, ఉద్దిన ఉసేన్‌, ‌మొహమ్మద్‌ అబ్దుల్‌ ‌ఖాదర్‌, ‌మొహమ్మద్‌ అల్తాఫ్‌ అహ్మద్‌, ‌మొహమ్మద్‌ ఇ‌మ్రాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని డీసీపీ రాజేష్‌ ‌చంద్ర తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *