ధ్యాన మయమైన మహేశ్వర మహా పిరమిడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 రోజులపాటు కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకల్లో భాగంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులతో ఆ ప్రాంతమంతా ధ్యానమయమైంది. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో శాకాహార జగతే లక్ష్యంగా కైలాసపురిలో పిరమిడ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ధ్యానులు ఎక్కడికి వచ్చి వక్తల సలహాలు సూచనలు తీసుకొని ధ్యానంలో నిమగ్నమవుతారు. మహేశ్వర మహా పిరమిడ్ కి వచ్చే ధ్యానుల కోసం ఫౌండర్ ట్రస్టులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *