ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ధీరత్వానికి ప్రతీక , లౌకికవాదానికి పెద్ద పీట వేసిన మహోన్నత నాయకుడు ఛత్రపతి శివాజీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు.అనంతరం కాజీపల్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, గాంధీ మహాత్ముడు విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేష్ గౌడ్, సర్పంచులు సత్యనారాయణ, జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహ, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *