సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 14: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎం ఆర్)డెలివరీ పూర్తి చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం కు సంబంధించి ఏ రోజుకు ఆరోజు ట్యాబ్ ఎంట్రీ చేయాలని డి సి ఓ , డి ఆర్ డి ఓ. కు సూచించారు.నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటివరకు 26 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు అడిగిన వెంటనే వాహనాన్ని ఏర్పాటు చేసేలా, వాహనాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డి సి ఓ ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, డీఎస్ఓ వనజాత, సివిల్ సప్లై డి ఎం సుగుణ బాయ్, ఏపీ డి సూర్యారావు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి





