ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 19: దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీని మంగళవారం కోడంగల్ నియోజకవర్గ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య చారి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్ రాములు ఉపాధ్యక్షులుగా కే అశోక్ చారి ప్రధాన కార్యదర్శిగా వడ్ల అశోక్ చారి కోశాధికారిగా వడ్ల వెంకటేష్ ముఖ్య సలహాదారులుగా వడ్ల శ్రీనివాస్, వడ్ల నరసింహచారి లను మరియు సహాయ కార్యదర్శిగా నరేష్ చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ఆల్ ఇండియా విశ్వకర్మ ఫెడరేషన్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీనివాస్ చారి, జిల్లా ఉమెన్స్ అధ్యక్షురాలు కవిత గోపాల్ చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నుకున్న కమిటీ విశ్వకర్మల అభివృద్ధికి కృషి చేయాలని , మండల విశ్వకర్మలంతా ఐక్యమత్యంతో మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్ విశ్వకర్మ సేవా సంఘం యూత్ ప్రెసిడెంట్ రాజేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ రాఘవేంద్ర చారి, అధికార ప్రతినిధి రవీంద్ర చారి మరియు మండల విశ్వకర్మలు పాల్గొన్నారు.



