జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ అక్కచెల్లమ్మలకు ఆడబిడ్డ లకు బతుకమ్మ, దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని తన తోబూటువు గా భావించి ఆడబిడ్డ లకు పెద్దన్నగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇబ్బందిగా ఉండకూడదని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి భారత దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రo గా తెలంగాణ రాష్ట్రమును నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమం లో చిలుకూరి బాల్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ చిలుకూరి మధుసూదన్ రెడ్డి, ఇటిక్యాల సుధాకర్ రెడ్డి , అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ముక్కెర సంజీవులు,మంత్రి కృష్ణమూర్తి,జూపల్లి బంగారి,వార్డు నెంబర్ దెశెట్టి లలిత భాస్కర్,డీలర్ పద్మ, పంచాయతీ సెక్రటరీ సతీష్,ముక్కెర పోచమ్మ, మాస్కురి నర్సమ్మ, శైలజ, పద్మావతి, జూపల్లి అంజమ్మ, జూపల్లి మాధవి, పోకల మంజుల, మర్రికింది కవిత వంటేరు వీమలమ్మ కేశపురం బాలమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
దౌలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి



