దేశానికి ఎకనమిక్‌ ఇం‌జన్‌గా హైదరాబాద్‌

  • ‌ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధి
  • రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి
  • మెట్రో కారిడార్‌ ‌విస్తరణకు కేంద్రం అడ్డంకి
  • అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం
హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 11 : దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని..దేశానికి ఈ నగరం ఎకానమిక్‌ ఇం‌జిన్‌గా మారిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఇటువంటి నగరానికి చేయూతనివ్వాల్సిన కేంద్రం మొండిచెయి ఇస్తుందన్నారు. హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశామన్నారు. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశామన్నారు. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాలాలపై 28 వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. స్ట్రాటజిక్‌ ‌నాలా డెవలప్‌మెంట్‌ ‌పోగ్రాం(ఎస్‌ఎన్‌డీపీ) దేశంలో ఏ నగరంలోనూ లేదని వెల్లడించారు. ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్‌-2‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కొన్ని పూర్తికావడంతో..ఎల్బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎం‌సీ పరిధిలో నాలాల అభివృద్ధి కొనసాగుతుందన్నారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య తర్వాత అంతా విజన్‌ ఉన్న వ్యక్తి కేసీఆర్‌ ‌మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్‌ ‌నాలాలపై 28 వేల ఇండ్ల కబ్జాలు ఉన్నాయని..నాలాల అభివృద్ధి చేయాలంటే 28 వేల పేదల ఇండ్లు కుల్చాల్సి వొస్తుందన్నారు. అలా చేస్తే ధర్నాలు, రాస్తారొకోలు చేస్తారన్నారు. ప్రజా ప్రతినిధులు సహకరిస్తే నాలాలపై ఉన్న ఇళ్లను తొలగిస్తామన్నారు. ఇకపోతే హైదరాబాద్‌ ‌మెట్రో ప్రాజెక్టుకు కేందప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మెట్రోలకే నిధులు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటీ 20 లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వడానికి కేంద్రానికి శత్రుదేశంపై పగబట్టినట్లుగా కేంద్రం తెలంగాణపై కక్షగట్టిందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్‌ఎన్‌డీపీ, మెట్రో రైలు, చార్మినార్‌ ‌పాదబాట అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు.
దిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్‌ ‌మెట్రో ఆడిటింగ్‌ ‌చేయించామన్నారు. అవి•ర్‌పేట మెట్రో స్టేషన్‌ ఎం‌త కిక్కిరిసిపోతుందో అందరికీ తెలుసన్నారు. 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని వెల్లడించారు. మెట్రో రైల్‌ ‌విషయంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. చెన్నై, బెంగుళూరు సహా ఇతర బీజేపీ పాలిత నగరాల్లో మాత్రం మెట్రో రైలుకు కేంద్రం సహకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మూడేళ్లలో శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టు వరకు మెట్రోను పూర్తిచేస్తామన్నారు. అదే విధంగా మెట్రో రైలులో యాడ్స్ ఉం‌డాలని కాంగ్రెస్‌ ‌హయాంలో తీసుకున్న నిర్ణయమని చెప్పారు. మెట్రో ధరలు ఇష్టం వొచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని చెప్పారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని వెల్లడించారు. రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ ‌వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. శంషాబాద్‌ ‌విమానాశ్రయం వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తిచేస్తామన్నారు.
హైదరాబాద్‌ అం‌టే చార్మినార్‌ అని అందరికీ తెలుసన్న మంత్రి..పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. హైదరాబాద్‌ ‌సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్‌ అన్నారు. ఎన్ని అధునాతన భవంతులు వెలసినా హైదరాబాద్‌ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదన్నారు. గుల్జార్‌హౌస్‌, ‌విర్‌-ఆలం-మండి, ఆషుర్‌ ‌ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయన్నారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్‌ ‌లైటింగ్‌ ‌పనులు చేపట్టామని తెలిపారు. చార్మినార్‌ ‌నుంచి దార్‌-ఉల్‌-ఉలం స్కూల్‌ ‌వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. హెరిటేజ్‌ ‌భవంతుల పూర్వవైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని స్పష్టం చేశారు. 55 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 9 నెలల్లో పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *