దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత

దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ ‌దిగువకు పడిపోయాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 15 డిగ్రీ సెల్సియస్‌ ‌కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడింది. ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ ‌సిటీలో ఇవాళ అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కాన్పూర్‌లో 11 డిగ్రీ సెల్సియస్‌ ‌కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి చంపేస్తున్నది. దాంతో చలి బాగా పెరిగిపోయింది. జనం ఇండ్ల నుంచి కాలు బయటపెట్టలేక పోతున్నారు. పైగా గత కొన్ని రోజుల నుంచి చలి ప్రతాపం కొనసాగుతుండటంతో దాని నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటున్నారు. ఇక ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతు న్నాయి.

చలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం 5.30కే మొదలవుతున్న చలి ఉదయం 8.30 దాటినా ప్రభావం చూపుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 8.30 వరకు మబ్బులు కమ్మి ఉండడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌సహా పలు జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌ ‌సిటీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు సీజనల్‌ ‌వ్యాధుల బారిన పడుతున్నారు. ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం కూలీ పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. పెరిగిన చలితో వాహన దారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *