- మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషాల్లో ప్రమాదాలు
- మొత్తం 18 మంది దుర్మరణం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దేశంలో రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ఘటనల్లో కనీసం 26 మంది మృత్యువాత పడ్డారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సప హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధి జిల్లా రేవా-సాత్నా సరిహద్దుల్లో అతివేగంతో వచ్చిన ట్రక్కు ఆగివున్న రెండు బస్సులను ఢీకొట్టింది. ఈ ఘటనలో పద్నాలుగు అక్కడికక్కడే మరణించారు. మరో 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సు రెండు ముక్కలయింది. మరో బస్సు నుజ్జునుజ్జు అయింది. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్ మహాకుంభ్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
గాయపడినవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గుజరాత్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వడోదరలోని నారాయణ్ వాడీ సపంలో అట్లదార్-పాద్ర హైవేపై ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పాద్రాలోని లోలా గ్రామానికి చెందిన అరవింద్ నాయక్ కుటుంబం వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వడోదర అసిస్టెంట్ కమిషనర్ ప్రణవ్ కటారియా తెలిపారు. ఆరుగురు ప్రయాణిస్తున్న ఆటోను ఎర్టిగా కారు ఢీకొట్టగా… ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని…మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. 8 ఏళ్ల ఆర్యన్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
దీనిపై కేసు నమోదు చేసుకుని..కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతులు అరవింద్ నాయక్, అతని భార్య కాజల్, కుమారుడు గణెళిష్, కుమార్తె దృష్టి, మేనకోడలు శివానిగా గుర్తించామన్నారు. ఒడిశాలోని జాజ్ పుర్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాల పీఎస్ పరిధిలోని నెయిల్‌పూర్ సపంలో రెండు ట్రక్కులు ఢీ కొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ధర్మశాల పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురు వ్యక్తులతో కోల్‌కతా వైపు వెళ్తున్న ఓ ట్రక్కు .. ఆగి ఉన్న మరో ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ధర్మశాల పోలీసులు తెలిపారు. ఆరుగురు అక్కడిక్కడే మరణించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు. మృతులంతా పశ్చిమబెంగాల్ కు చెందిన వారీగా గుర్తించారు.




