దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి
ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి
ప్రజల చేతిలో వజ్రాయుధం వోటు
కాంగ్రెస్‌ ‌చేతికి అధికారం ఇస్తే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌
24 ‌గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
50 ఏళ్లుగా కాంగ్రెస్‌ ‌రాష్ట్రానికి, దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదు
ధరణితో రైతు బాధలకు చెక్‌ ‌పెట్టాను…అంచెలంచెలుగా 16 వేలకు రైతుబంధు
తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే…
మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

‌మంథని / ముత్తారం, ప్రజాతంత్ర, నవంబర్‌ 07 : ‌దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ పార్టీలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లామీఱజూ…ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి దశలో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా ప్రజలు ఆలోచించి విజ్ఞతతో అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు గెలిచే ప్రజాస్వామ్య పక్రియ ప్రజల చేతిలో వజ్రాయుధంగా ఉన్న వోటు రూపంలో నిర్ణయించాలని సూచించారు. నాలుగు పైసలకు ఆశపడి ఆలోచించకుండా ఎవరో చెప్పారని గుడ్డిగా వోటు వేయకుండా.. పనులు చేసే ప్రభుత్వానికి వోటు వేయాలని, వోటు మీ తలరాతను మారుస్తుందని సూచించారు.

50 ఏళ్లుగా కాంగ్రెస్‌ ‌పార్టీ చేసింది ఏమీ లేదు…
దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు ఏకబిగిన పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు .1956 లో తెలంగాణ ఉడగొట్టి కాంగ్రెస్‌ ‌పార్టీ ఆంధ్రలో కలిపిందని 55 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు గోసపంచుకుందని కాంగ్రెస్‌ ‌పార్టీని దుయ్యబట్టారు.దేశంలో కాంగ్రెస్‌ ,‌బిజెపి పార్టీలకు దళిత గిరిజన ఆదివాసి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.


కాంగ్రెస్‌కు అధికారమిస్తే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌..
‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికారమిస్తే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌, ‌చెప్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్‌ ‌సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం కష్టపడి ప్రారంభించిన రైతుబంధును కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చినట్లయితే రామ్‌ ‌రామ్‌ ‌చెప్తారని సీఎం అన్నారు. రైతులు ఆత్మ గౌరవంగా బతకాలని ప్రవేశపెట్టిన రైతుబంధును కాంగ్రెస్‌ ‌నాయకులు దుబార పదకంగా ప్రచారం చేస్తున్నారని ప్రజలు కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు . టి పిసిసి అధ్యక్షుడు 24 గంటల కరెంటు ఇస్తున్నారని అబద్ధాలు చెబుతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

మంథని నియోజకవర్గానికి 1000 కోట్లు ….
అత్యంత వెనుకబడిన నియోజకవర్గంలో ఉన్న మంథని అభివృద్ధి కోసం  వెయ్యి కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం బీసీ బిడ్డ అయిన పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఎన్నికలలో సీట్లు తక్కువగా వస్తాయని ,సీటు వచ్చిన ఈ తరగతుల బిడ్డలను కలిసికట్టుగా ఉండి గెలిపించుకోవాలని కోరారు. మంథని నియోజక వర్గానికి ఎన్నికల అనంతరం నేనే స్వయంగా ఒకరోజు కేటాయించి కావలసిన అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు నాయకులతో చర్చించి  నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మంథని నియోజకవర్గానికి శ్రీధర్‌ ‌బాబు చేసింది ఏమీ లేదు .వెనుకబడిన నియోజకవర్గం మంథనీకి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసింది ఏమీ లేదని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు శ్రీధర్‌ ‌బాబు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని ఆయన తండ్రి స్పీకర్‌ ‌గా కూడా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు . మంథనినియోజక వర్గ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *