దేశ రాజధాని ఢిల్లీలో దారుణం మహిళకు 14 సార్లు అబార్షన్‌

‌తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
న్యూ దిల్ల్లీ,జూలై14: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. నయవంచనకు మారుపేరుగా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌.. ‌తన ప్రియురాలిని ప్రాణాలను బలిగొన్నాడు. ప్రేమ పెళ్లి పేరుతో ఓ మహిళకు టెకీ దగ్గరయ్యాడు. ఆ మహిళ 14 సార్లు గర్భం దాల్చగా.. 14 సార్లు అబార్షన్‌ ‌చేయించాడు. పెళ్లి చేసుకుంటానని సాకులు చెప్పి మహిళను నమ్మిస్తూ వచ్చాడు. అయితే పెళ్లి చేసుకుందాం అని ప్రియురాలు అడిగిన ప్రతీసారి నిరాకరిస్తూ వచ్చాడు. ప్రియుడు నిరాకరించడాన్ని తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంది. జులై 5న ఢిల్లీలోని జత్‌పూర్‌ ‌ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ‘’జైత్‌పూర్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు సంబంధించి జూలై 5న పోలీసులకు పిసిఆర్‌ ‌కాల్‌ ‌వచ్చింది.

ఓ ఇంట్లో మహిళ ఉరి వేసుకుందని సమాచాం అందింది. వెంటనే ఆ ప్రదేశానికి పోలీసు బృందాన్ని పంపించారు. మహిళను ఎయిమ్స్‌కు తరలించగా, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారని’’ డిసిపి ఈషా పాండే తెలిపారు. శవపరీక్ష అనంతరం బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌ ‌నోట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌నమ్మక ద్రోహం చేశాడని బాధిత మహిళ తన సూసైడ్‌ ‌నోట్‌లో పేర్కొంది. మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు గత 8 ఏళ్లుగా భర్త నుంచి మహిళ వేరుగా ఉంటోందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *