దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 24: అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని నరేంద్ర కాలనీ, ఇస్నాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ విజయదశమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నరేంద్ర కాలనీ  తో పాటు ఇస్నాపూర్ గ్రామంలో సెంట్రింగ్ యూనియన్  ఏర్పాటుచేసిన దేవి విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాలకు ప్రతీకగా విజయదశమి వేడుకలను నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారని వెల్లడించారు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, నాయకులు జనార్ధన్, రమేష్, వీరేష్ రాములు,రఘు, కొమురయ్య, కొండల్ రెడ్డి, చిన్నా రావు,యాదగిరి, కాలనీవాసులు, యూనియన్ సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *