దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం

ముగ్గురు మృతితో విషాదం
యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్‌ ‌షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో పందిరిలో 300-400 మంది దాకా ఉన్నారని నార్దువా జిల్లా మెజిస్ట్రే ‌గౌరంగ్‌ ‌రాఠీ తెలిపారు.

వీరిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. వెలుతురు కోసం ఏర్పాటు చేసిన ప్లడ్‌ ‌లైట్‌ ‌వేడెక్కడంతో వైర్లకు మంటలు అంటుకున్నాయని, పందిరి మొత్తం కాలి బూడిదయ్యిందని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అదనపు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *