పక్క ఎక్కిన వెంటనే
కౌగిట్లో చేరుతుంది!
చీకటి మాటు సిగపట్లకు
చాటు ఉంటుంది!
తనువుతో సరసంలో
ఒక్కోసారి కాళ్ళు కనిపిస్తే,
ఇంకోమారు తల
బయటకు వస్తుంది!
చలి గిలిగింతలు ఎక్కువైతే
వెచ్చని కౌగిలింతలు తనవే
అవుతాయి!
ఉహుహూ అంటూ సల్లాపానికి దిగితే
ఆహాహా అంటూ ముద్దుల అల్లరి
తనదే అవుతుంది!
అలసిసొలసిన దేహానికి
ఆదమరపు ఇస్తుంది!
దూరి దగ్గరైననాడు కాలం
మొత్తం కరిగించేస్తుంది!
ముద్దులు మోజులు తీరేవరకు
మంకుపట్టు వీడదు!
బారెడు పొద్దెక్కినా తోసేసేవరకు
మంచం దిగుదు!
కాలాన్ని బట్టి ఒకసారి
కిందుంటుంది
మరోసారి మీదకొస్తుంది!
సరసంలో మోజుపుట్టి
సవతిని తెచ్చుకుంటే!
సయోధ్యలేక ఇద్దరితో
ఆ రాత్రి మహాతంటే!
పుట్టిన నాడే పక్కలో
పడుకుంటుంది!
పాడికట్టిన నాడూ
చుట్టుకునే ఉంటుంది!
– ఉషారం
9553875577
దుప్పటి





