దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం పోరాడాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : భారత రాజ్యాంగం కల్పించిన దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి సాధించుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. దివ్యాంగుల సాధనకై గాంధీ జయంతి రోజు రాష్ట్ర దివ్యాంగుల సంఘాలు ముఖ్య నాయకులు గంగారాం మౌన దీక్ష చేశారు. ఆయన చేస్తున్న మౌన దీక్షకు ఆచారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాల వసతులు, వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా దివ్యాంగుల కన్వీనర్ ఏదుల శ్రీను గౌడ్, జిల్లా దివ్యాంగుల నాయకులు కరుణాకర్, బాలరాజ్, అనిల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *