ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో నియోజకవర్గంలోని దివ్యాంగులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో దివ్యాంగుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గంతో పాటు దివ్యాంగుల అభివృద్ధికి పాటుపడతానన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లు ఐదు శాతం పెంచిందని ఆచారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్, తాలూకా ఇంచార్జ్ గోరేటి నరసింహ, శ్రీకాంత్ సింగ్, చెక్కల లక్ష్మణ్, దివ్యాంగులు ఏదుల శ్రీను, రమేష్, పర్వత్ రెడ్డి, గంగారం, నాగభూషణ్, నరేందర్ రెడ్డి, వెంకటేష్, శ్రీధర్, కళాకారుల బృందం పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత





