దిల్ల్లీ మద్యం కేసుతో తెలంగాణకు ఏం సంబంధం?

ఇక్కడ ఆందోళనలు ఎందుకు చేస్తారు: కోమటిరెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: దిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. ఇలా చేయడం ప్రజలను అవమానించడమే అన్నారు. ఓ అవినీతి కేసులో చర్యలు తీసుకుంటే ధర్నాలు చేసి ఏం సందేహం ఇవ్వబోతున్నారని అన్నారు.  గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు.ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే.. నేడు చేయడం విడ్డూరం. ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో నిరసనలు ఎందుకన్నారు. కానీ ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? దిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు చేసుకోండి.

అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తీసుకుని రావద్దని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఆనాడు కెటిఆర్‌ హైదరాబాద్‌లో ధర్నాలను నిరసించిన విషయాన్ని ప్రస్తావించారు. ఢల్లీి మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *