దిల్లీ ప్రజల సంక్షేమం కోసమే ఆర్డినెన్స్

న్యూదిల్లీ,అగస్ట్: ‌దిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన దిల్లీలో డియాతో మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.ఆస్తులు,ఇతర అంశాల నుతా రుమారు చేయడానికి మాత్రమే ఆప్‌ ‌పార్టీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తో ందని, అవినీతి, కుంభకో ణాలకు అడ్రస్‌ ‌గల పార్టీ అని.. అలాంటి అవినీతి పార్టీకి బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు మద్దతు తెలుపుతు న్నారంటే తెలంగాణ ప్రజలు గుర్తించా లన్నారు.

అవినీతి పార్టీలకు చెక్‌ ‌పెట్టేందుకు ఒక ఉద్యమం చేపట్టబోతు న్నామని లక్ష్మణ్‌ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలను రాజకీయంగా పుట్టగతులు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని, ఇండియా కూటమిలోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథ కాలను చూడలేక ప్రతిపక్షాలు అవి శ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు.చర్చకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటే సభ నుండి పారిపో తున్నారని, అమిత్‌ ‌షా కూడా మణిపూర్‌ అం‌శంపై చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్తుంటే అవిశ్వాసం పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *