దిల్లీ ఎయిర్‌పోర్టులో అధిక రద్దీ

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో అధిక రద్దీపై అధికారులు అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా అధ్యక్షతన ఈ టింగ్‌ ‌జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ యిర్‌ ‌పోర్టులో రద్దీ సమస్య ప్రయాణికులను వెంటాడుతోంది. చెక్‌ ఇన్‌ ‌దగ్గర గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని సందర్భాల్లో ఫ్లైట్‌ ‌కూడా మిస్‌ అయ్యామని ప్రయాణికులు చెబుతున్నారు. ఎయిర్‌ ‌పోర్టు రద్దీపై వస్తున్న ఫిర్యాదులతో ఇప్పటికే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎయిర్‌ ‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. రద్దీ సమస్యకు చెక్‌ ‌పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *