- సేవ్ కాంగ్రెస్ నేతలతో ముఖాముఖి చర్చలు
- పార్టీలో పరిస్థితులుపై ఆరా
- అన్ని విషయాలు చెప్పామన్న పలువురు నేతలు
- ఇరువర్గాలతోనూ దిగ్విజయ్ సింగ్ చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : తెలంగాణ కాంగ్రెస్ లోని విబేధాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత,హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ దిగ్విజయ్ సంగ్ గురవారం ఒక్కొక్కరితో భేటీ అయి వారితో చర్చిస్తున్నారు. గాంధీభవన్‌లో ఫేస్ టు ఫేస్ వి•టింగ్‌లు కొనసాగించారు. రేవంత్ రెడ్డి.. టీపీసీసీ సీనియర్ నేతల మధ్య నెలకొన్న గొడవలకు చెక్ పెట్టేందుకు దిగ్విజయ్ పూర్తి డేటా కలెక్ట్ చేస్తున్నారు. సేవ్ కాంగ్రెస్ వాదులతో, మిగిలిన నేతలతో ఏకాంతంగా మాట్లాడారు. పార్టీలో పరిణామాలపై తీవ్ర విమర్శలు చేసిన నేతలతో ఉదయం నుంచి దిగ్విజయ్ సింగ్ భేటీ కొనసాగింది. తొలుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో, వీహెచ్ హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, అనంతరం రేణుకాచౌదరితో ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యారు.
అయితే ఆయనకు పలువురు నేతలు సీక్రెట్ రిపోర్టులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తమ విమర్శలకు ఆధారాలతో సహా.. నేతలు దిగ్విజయ్ సింగ్‌కు రిపోర్టు అందజేసినట్లు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలను దిగ్విజయ్‌కు వివరించినట్లు దామోదర రాజ నర్సింహ తెలిపారు. గాంధీభవన్‌కు రాకుండా హోటల్‌లోనే దిగ్విజయ్‌ను కలిశారు జగ్గారెడ్డి. తాను చెప్పాల్సినవన్నీ చెప్పానని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ తాను గాంధీభవన్‌లో కలవబోనని.. పార్టీలో పరిస్థితులన్నీ వివరించానని చెప్పారు. దిగ్విజయ్ అంటేనే పొలిటికల్ ఫార్ములా అని, కచ్చితంగా సమస్యకు పరిష్కారం వొస్తుందని జగ్గారెడ్డి భావిస్తున్నానన్నారు.
దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం వీహెచ్ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్లకు గౌరవం ఇవ్వాలని చెప్పానన్నారు. సోషల్ వి•డియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను చెప్పిన సమాధానాలకు దిగ్విజయ్ సింగ్ బాగానే రెస్పాండ్ అయ్యారని వీహెచ్ తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, ఏకాభిప్రాయం కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని మల్లు రవి చెప్పారు. మెజార్టీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామన్నారు. దిగ్విజయ్ భేటీల నేపథ్యంలో మల్లు రవి ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా గాంధీభవన్‌లో వరుస వి•టింగ్‌లతో సందడి నెలకొంది. ముందు పిసిసి కమిటీతో, తర్వాత అసంతృప్త నేతలతో వి•టింగ్ నిర్వహించారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడేందుకు ఒక్కో నేతకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ క్రమంలో సీనియర్ నేతలకు మరికొంత సమయం కేటాయించినట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చెలరేగిన అంతర్గత కలహాలను చక్కదిద్దే పనిలో ప్రత్యేక పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ నిమగ్నమయ్యారు. భేటీ అనంతరం సీనియర్ నేత వీహెచ్ విడియాతో మాట్లాడుతూ… దిగ్విజయ్‌సింగ్‌తో అన్ని విషయాలు వివరించి చెప్పినట్లు తెలిపారు.
కోవర్టుల అంశం చర్చకు రాలేదని చెప్పారు. అందరితో కలిసి ముందుకు పోవాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్లాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి వీహెచ్ సూచించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కూడా పదవులు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. కొందరు సీనియర్లు ఎందుకు ఆవేశంతో మాట్లాడారో తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి అన్నారు. దిగ్విజయ్ సింగ్‌తో రేణుక భేటీ అయ్యారు. అనంతరం రేణుక వి•డియాతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్‌ను కలిసి తన అభిప్రాయాలు తెలిపానన్నారు. పార్టీ సమస్యలు పరిష్కరించేందుకు దిగ్విజయ్ వొచ్చారని తెలిపారు. త్వరలోనే పార్టీలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కేసీఆర్ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు.




