హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ‘‘డీలిమిటేషన్(నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది..మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము..కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇది గురిస్తారని ఆశిస్తున్న..’’ అని మీడియాలో వైరల్ అవుతున్న డీలిమిటేషన్ అంకెలపై మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో తన ట్వీట్లో స్పందించారు.




