వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 28 : ఈరోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీ నందు, జగదాంబ కాలనీల యందు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది. పక్కకాలనీలు అయిన ద్వారకమాయినగర్ మరియు చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వరదనీరు హైకోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీ, జగదాంబ కాలనీల యందు వచ్చి వరదనీరు నిలిచిపోవడం జరుగుతుంది. ఇట్టి వరదనీరు చేరడం వల్ల కాలనీవాసులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. కావున అక్కడ ఒక ఔట్ లేట్ నిర్మిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి తప్పకుండా ఔట్ లేట్ నిర్మాణం అతి త్వరలో చేపట్టడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రణాళికలు అధికారులచే చర్చించడం జరుగుతుంది అని తెలిపారు. జరిగిన ఇబ్బందులకు చింతిస్తున్న అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,కుంట్లూరు వెంకటేష్ గౌడ్,జె.ఏ.సి.అధ్యక్షులు శ్రావణ్,జనరల్ సెక్రటరీ గుత్తా లక్ష్మారెడ్డి, గుజ్జ జగన్ మోహన్, బి.డి.ఎల్.కాలనీ జనరల్ సెక్రటరీ సుధీర్ రెడ్డి, కృష్ణ రెడ్డి, అవినాష్, శ్రీనివాస్, సునీల్, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




