త్వరలో పటాన్ చెరుకి బాబా రాందేవ్ రాక

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
హరిద్వార్ లో పతాంజలి సంస్థ సీఈవో బాలకృష్ణతో భేటీ.
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: యోగా గురువు బాబా రాందేవ్ అతి త్వరలోపటాన్ చెరు లో పర్యటించనున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.హరిద్వార్ లోని పతాంజలి సంస్థ సీఈవో బాలకృష్ణతో గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పటాన్ చెరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న యోగ కేంద్రం వివరాలను ఆయనకు వివరించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వివిధ కార్యక్రమాల ద్వారా యోగ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో అందరికీ ఉపయోగపడేలా యోగా కేంద్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. యోగా కేంద్రం ప్రారంభోత్సవానికి బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేయగా, ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎమ్మెల్యే సోదరుడు, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *