త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్  భారీ మెజార్టీతో విజయం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలమత ముదిరాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు గణపతిని ప్రార్థించారు.గణపతి నవరాత్రుల సందర్భంగా అమీన్ పూర్ మండలం గండిగూడెం గ్రామంలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూను గొల్ల రవి కుమార్ యాదవ్ లక్ష 70 వేలకు లడ్డును కైవసం చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని స్వామివారి లడ్డును నీలం మధు ముదిరాజ్ కి ఆయన నివాసంలో అందజేశారు. పటాన్ చెరులో విజయం నీలం మధు ముదిరాజ్ దే అన్నారు. ప్రజలందరూ కూడా నీలం మధు ముదిరాజ్నే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీతో సంబంధం లేకుండా గెలుపు నీలం మధు దే అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *