తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్న లయన్ డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :లయన్స్ క్లబ్ల్ ద్వారా విశిష్ట సేవలందించిన డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్నార లయన్స్ జిల్లా 320ఏ జిల్లాలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సమాజంలో లయనిజం వ్యాప్తికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో అత్యున్నత పురస్కారం ఇవ్వబడింది.సోమవారం రాత్రి జిల్లాలోని కొంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో మల్టిపుల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి. బాబూరావు,గాట్ ఇసామే లీడర్ లయన్ సునీల్ కుమార్ ,ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ నరేందర్ రెడ్డి,మల్టిపుల్ లీడర్ చెన్నకిషన్ రెడ్డిలు కలిసి ఈ అవార్డు బహూకరించారు ఈ సందర్భంగా మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ,అవార్డ్ మరింత బాధ్యతను పెంచిందని,తెలంగాణా రాష్ట్ర వ్యాప్త అవార్డ్ అందుకోవడం ఇది వరసగా మూడోసారి అని,ఈ సేవలకు గుర్తింపుగా గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా వైస్ గవర్నర్ గా ఎన్నుకున్నారని తెలియజేశారు.వీటన్నింటితో తన బాధ్యతలు ఇంకా పెరిగాయని పేర్కొన్నారు.లయన్స్ క్లబ్ లను విస్తరించి మరింత ఎక్కువగా సమాజానికీ ఉపయోగ పడే కార్యక్రమాలను చెబడతాననీ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *