షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26: కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఫరూఖ్ నగర్ మండలంలోని కంసాన్ పల్లి, విట్యాల గ్రామాల్లో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలొ భాగంగా ప్రజలను ఉద్దేశించి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారికే అవకాశం ఇవ్వండని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల అవసరాలు కష్టాలు తెలిసినవాన్ని అని అన్నారు.గతంలో ఎన్నో పార్టీ లకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి భాజపా కు అవకాశం ఇవ్వండి అభివృద్ధి దిశలో దూసుకుపోదామాని అన్నారు.ప్రతిపక్షాల మోసపురితమైన మాటలు నమ్మొద్దని అన్నారు
ఈ కార్యక్రమం లొ బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, విజయ్ బాస్కర్,ఆకుల ప్రదీప్, మోహన్ సింగ్, లష్కర్ నాయక్, శ్యామ్ సుందర్ రెడ్డి, విష్ణువర్ధన్ గౌడ్, వెంకటేష్ , విష్ణు, హన్మంత్, కిషన్ నాయక్, గణేష్, రమేష్,అనిల్ మరియు కంసాన్ పల్లి, విట్యాల గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.




