హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దళిత బహుజన పార్టీ(డిబిపి) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి చెక్క శ్యామ్ ఎన్నికల ప్రచారం కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ మతతత్వ, కుల దురహంకార, అగ్ర కుల పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ అధికారంతోనే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పటిష్టంగా అమలు జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తామని అన్నారు. డీవీపీ అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు సి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు




