తెలంగాణలో కుటుంబపాలన అంతం ఖాయం

  • ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే
  • ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్‌
  • ‌బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ
  • బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని..బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ‌మండలం ఔషాపూర్‌లోని వీబీఐటీ కళాశాలలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా ఘట్‌?‌కేసర్‌ ‌మండలం ఔషాపూర్‌?‌లోని వీబీఐటీ కళాశాలలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌.. ‌ప్రస్తుతం ప్రాంతీయ స్థాయికి పడిపోతుందని విమర్శించారు. నేడు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ స్థాయికి ఎదుగుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ‌తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు.స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కేవలం భారత దేశంలోనే ఉందని నడ్డా పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. కమలం వికసిస్తుంటే.. కేసీఆర్‌ ‌భయపడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు. ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, జేఎంఎం, తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ప్రధానమంత్రి అవాస్‌ ‌యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందన్న నడ్డా..తెలంగాణలో కేసీఆర్‌ ‌రెండు పడక గదుల ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు.

మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. దేశ వ్యాప్తంగా గరిబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ‌సరఫరా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఈ పథకంలో తెలంగాణకు చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో దేశంలో పేదరికం తగ్గిందని ఐఎమ్‌ఎఫ్‌ ‌తెలిపిందన్నారు. కౌన్సిల్‌ ‌సమావేశం నుంచి ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌.. ‌ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుంది. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. తెలంగాణలో కమలం వికసిస్తుంటే కేసీఆర్‌ ‌భయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ‌పాలన..రజాకార్ల పాలనను తలపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనకు..ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *