తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్ పేట్ పాత గ్రామము శివ శంకర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పతకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి కోసం – ప్రజల భవిత కోసం ఆరు గ్యారెంటి పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు.కాంగ్రెస్ మొదటి గ్యారంటీ  “మహాలక్ష్మి” పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500తో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ రెండవ గ్యారంటీ  “రైతు భరోసా”ప్రతి ఏటా రైతులకు మరియు కౌలు రైతులకు ఎకరాకు రూ.15000 తో పాటు ప్రతి ఏటా భూమి లేని పేదలకు రూ.12000 ఇవ్వటమే కాకుండా ప్రతి ఏటా వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ మూడవ గ్యారంటీ  “గృహాజ్యోతి”
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కాంగ్రెస్ నాల్గవ గ్యారంటీ  “ఇందిరమ్మ ఇండ్లు”ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఐదవ గ్యారంటీ  “యువ వికాసం” విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. కాంగ్రెస్ ఆరవ గ్యారంటీ “చేయూత” రూ.4000 నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కీసర యాదిరెడ్డి, మీర్ పేట్ కార్పొరేటర్లు చల్లా బాల్ రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు దేవగోని కృష్ణ,  జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్, ఏడు దొడ్ల సురేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు ఆల శ్రీనివాస్ రెడ్డి, పేట నర్సింహా, సిద్దు చారి, స్వామి నాయక్, గెల్లా సుభాష్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ ముదిరాజ్, పైళ్ళ శేఖర్ రెడ్డి,  పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *