పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఏఐసీసీ కార్యదర్శి, కర్నాటక నీటిపారుదల శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజును శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని సచివాలయంలో బోసురాజును కలిసి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గాలి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి ఇద్దరు చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బోసురాజు పేర్కొన్నారు. కర్నాటకలో అనుసరించిన ఎన్నికల వ్యూహాలనే తెలంగాణాలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరించనుందని బోసురాజు స్పష్టం చేశారు. నాయకులు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆయన సూచించారు.



