పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన పండుగలకు కీర్తి ప్రతిష్టలు వచ్చేలా చేశారని అన్నారు. ఇది మన సంప్రదాయాలకు దక్కుతున్న గౌరవం అనిఅన్నారు.భవిష్యత్ లో కూడా అధికారంలోకి బీఆర్ఎస్ ను తీసుకువస్తే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో జంగయ్య, సత్యా,శ్రీశైలం,భాస్కర్,శ్రీను, బాల్ రాజ్,శ్రీను,కిషోర్,మధు,కృష్ణ, సాయి, జాతర నిర్వాహకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


