హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ఈ సందర్భంగా కేయిన్స్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలో సెవి కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది కేయిన్స్ టెక్నాలజీ సంస్థ. రూ. 2,800 కోట్ల పెట్టుబడితో ఓసాట్, కాంపౌండ్ సెవి కండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సెవి కండక్టర్ పరిశ్రమకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రపంచ గమ్యస్థానాల లీగ్లో తెలంగాణ చేరినందుకు గర్వకారణంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫ్యాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.





