ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకటేష్ ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ నందు మిషన్ భగీరథ ముఖ్య కార్యాలయంలో మిషన్ భగీరథ ఈ ఎన్ సి కృపాకర్ రెడ్డి సమక్షంలో ఉదయం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మిషన్ భగీరథకు వైస్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్, హరీష్ రావు లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఉప్పల వెంకటేష్





