ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ఆటో షోరూమ్స్, ఆటోడీలర్లు తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆటో డీలర్స్ ఆయా షోరూముల్లో ఆటోలను బ్లాక్ చేసి హైదరాబాదులో ఉన్న షో ద్వారా అమ్మకాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎస్.దయానంద్, కో-కన్వీనర్ రుద్రాక్ష మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్యత సమితి జేఏసీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇలా చేయడం వలన ఆయా జిల్లాలో ఉన్న డ్రైవర్ల జీవనోపాధికి ఆటో కొనుక్కోవలసిన అవసరం వస్తే జిల్లాలో కాదని హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. అసలు మోసం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందని, ఒక్కొక్క ఆటో మీద దాదాపు రూ.50 వేలు అధికంగా చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ విధంగా ఇన్వాయిస్ కంటే ఎక్కువ చేసి అమ్మడం వలన ఆటోలు కొనుక్కోవాలనుకున్న డ్రైవర్లకు పెను భారం పడుతుందన్నారు. ఇప్పటికైనా కూడా ఈ షోరూమ్స్, డీలర్లు కళ్ళు తెరిచి వాళ్ళ తప్పును సరిదిద్దు కాకపోతే తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్యత సమితి జేఏసీ ఆయా ఆటో డీలర్, షోరూమ్ లపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. విధానం మార్చుకోకపోతే ఈ నెల 5 న తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోలీసులు మార్గ మధ్యంలో నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడాన్ని ఖండిస్తూ రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైన తరుణంలో ఈనెల 10 అర్ధ రాత్రి నుండి రవాణా రంగం బంధుకు పిలుపునిచ్చారు. ఆటోలకు మీటర్ చార్జెస్ పెంచకపోవడం, నగరంలో ఆటోలకు పర్మిట్స్ ఓపెన్ చేయకపోవడం కనుక ప్రతి ఒక్క డ్రైవర్లు, ఓనర్లు ట్రాన్స్ పోర్ట్ లో పని చేసే రవాణా రంగ కార్మికులు ఈ బంద్ కు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ టి.రాజశేఖర్ రెడ్డి, బి.రామకృష్ణారెడ్డి, పి.సంపత్ రెడ్డి, రాంపల్లి మల్లేష్ గౌడ్, మల్లికార్జున్, ఈశ్వర్ పాండే, గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.



