కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 27 : తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలానికి చెందిన కప్పాటి శివరామకృష్ణా రెడ్డిని నియమిస్తూ అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జ్ వరున్ పాండే ఆదేశాలు జారీచేశారు.ఈ మేరకు ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ అధ్యక్షుడు సిహెచ్. శైలేంద్ర గాందీభవన్ లో నియామక పత్రం కప్పాటి శివరామకృష్ణా రెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా కప్పాటి శివరామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ,తనను ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ జెయింట్ కన్వీనర్‌గా నియమించినందుకు అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జ్ వరుణ్ పాండే,ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ అధ్యక్షుడు సిహెచ్. శైలేంద్రకు,ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే,రాహుల్ గాంధీ,సోనియా గాంధీ అల్ ఇండియ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ అల్లువార్ శ్రీ క్రిష్ణ సురబి దివేది,సయ్యద్ ఖలీద్ హైమద్,రమేష్ బాబు,ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా శివరామకృష్ణా రెడ్డి నియామకం




