తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి ఆనాటి కాలంలోనే తన యుద్దసహసాలతో ధైర్యంతో 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను జయించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసి, తన పరిపాలనతో సామాన్య ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని  ఏడు నెలల పాటు సుపరిపాలన అందించాడని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఖిలా షాపూర్ గ్రామంలో జన్మించి తెలంగాణలోని బహుజన చక్రవర్తిగా ఒక సామాన్యుడు కూడా తన ధైర్యసహసాలతో రాజాధికారాన్ని సాధించవచ్చని నిరూపించాడని ఆయన అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టి నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  గతంలో  ఇచ్చిన హామీ మేరకు కాటమయ్య గుడి కోసం 300మీ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం తాలూకా అధ్యక్షులు సుక్క అల్లాజి గౌడ్, నాయకులు నిరంజన్ గౌడ్, గజ్జ వెంకటయ్య గౌడ్, సతీష్ గౌడ్, గజ బాలకృష్ణ గౌడ్, నరసింహ గౌడ్, ముకురాలగౌడ్, నాగయ్య గౌడ్, పల్లె నారాయణ గౌడ్, చుక్క హరినాథ్ గౌడ్, గుండ్రాతి కుమార్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్, నారాయణ గౌడ్, పరమేష్ గౌడ్, వెంకటయ్య గౌడ్, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *