తెలంగాణ గ్రామాలు దేశానికి  ఆదర్శంగా నిలుస్తున్నాయి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 3 :  తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ జాతీయ సలహాదారు హిమాన్షు మిశ్రా అన్నారు. మంగళవారం కడ్తాల్ గ్రామపంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి అమృత మరియు స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తో కలిసి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో  చేపట్టిన రైతు వేదిక,పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, మహిళా స్వయం సహాయక సంఘాల వారి వ్యాపార సముదాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ తీరు, పాఠశాలల అభివృద్ధి మరియు ఇంకుడు గుంతల నిర్వహణను పరిశీలించారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటునందిస్తుందని సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ సొంత నిధుల సమీకరణ మరియు  ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు.గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం పనితీరును ప్రశంసించారు. గ్రామపంచాయతీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల వివరాలను సమగ్రరూపకల్పనతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపీ) మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్డిజి) చేదనలో గ్రామపంచాయతీ పనితీరు ఆదర్శంగా ఉందని కితాబునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణకు మణిహారంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులను మరియు సర్పంచ్ పనితీరును ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, వార్డు సభ్యులు బిక్షపతి, గణేష్ నాయకులు అశోక్, రామచంద్రయ్య పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, క్షేత్ర సహాయకుడు వెంకటేష్ మహిళా సంఘాల సభ్యులు సిసి వసంత,వివోలు వనిత శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *