- అధికారుల తీరుపై ఫిర్యాదుల వెల్లువ
- డిజీపీ అంజనీ కుమార్‌పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు
- హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య
- కొత్తగా ఎస్పీల, పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం
- పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టో
అందుకనుగుణంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా తెలంగాణలో ఎన్నికల నిర్వహణ వేళ వేటు పడిన అధికారుల స్థానంలో ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా.. అధికారుల బదిలీకి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యానెల్ నుంచి అధికారులను ఎంపిక చేసిన ఈసీ.. అందుకు సంబంధించిన జాబితాను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. కొత్తగా నియమితులైన అధికారులు శుక్రవారం సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించారు. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆసీసీ సగ్వాన్‌ను.. రంగారెడ్డి కలెర్టర్‌గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతంను నియమించారు, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్,..
సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం,.. వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్?గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్షవర్థన్, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్‌ను నియమించారు. బదిలీ అయిన వాళ్లు ఈ రోజు సాయంత్రం లోపు బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఐపీఎస్‌ల బదిలీతో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాలను సమీపంలో ఉన్న డీసీపీలకు కేటాయించారు. త్వరలో బదిలీ అయిన స్థానాలకు కొత్త ఐపీఎస్?లను కేటాయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబరు 30న పోలింగ్, డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సవి•పిస్తున్న ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. జనగామ కలెక్టర్ శివలింగయ్యపై ప్రతిపక్ష నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, సీపీఎం, వైఎస్సాఆర్‌టీపీతో పాటు ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఆన్‌లైన్‌లో కంప్లైంట్స్ అందాయి. అధికార బీఆర్‌ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సురేష్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సన్మానించి ఫొటోలు దిగిన తీరును ఫిర్యాదుకు జత చేశారు. జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.డిజీపీ అంజనీ కుమార్‌పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారులపై ఊహించని స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై వేటు వేసింది. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఆ అధికారి మాకొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని లేఖలు ఇస్తున్నారు. సీఈఓను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఈసీకి కూడా డైరెక్ట్ మెయిల్స్? పంపుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు, ఎస్పీలు, కిందిస్థాయి ఆఫీసర్లపై భారీగా ఫిర్యాదులు చేశారు. ఈసీ సడెన్‌గా ఇరవై మంది అధికారులను బదిలీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్, బీజేపీ మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు రాష్ట్ర అధికార యంత్రాంగంపై ఫిర్యాదులు చేశాయి. గులాబీ పార్టీకి అనుకూలంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారని, డబ్బు, మద్యం పంపిణీని గత ఉప ఎన్నికల్లో నివారించలేకపోయారని ఫిర్యా దు చేశాయి. పార్టీల నేతలు, ఇతరులు ఈ-మెయిల్స్ ద్వారా అధికారులపై ఈసీకి ఫిర్యాదులు పంపారు. తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు అధికారులు కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పలువురు అధికారులు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా సైబరాబాద్ కవి•షనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీ అభిమానులను బెదిరిస్తున్నారని , నిఘా పెడుతున్నారని ఆరోపించారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్ లాంటి అధికారులు వ్యాపారులను బీఆర్‌ఎస్ కు చందాలు ఇమ్మంటూ బెదిరిస్తున్నారని అన్నారు.





