శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ సాధనలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను బి ఆర్ ఎస్ పార్టీ మరిచిపోయిందని అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే తమ బాధలు తీరుతాయని అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన తర్వాత సమస్యలు తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అయిపోయిన మూడు నెలలలో హైదర్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరియు ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని స్వయంగా కేటీఆర్ ఎమ్మెల్యే ప్రజా సమక్షంలో వాగ్దానం చేసి తనను టిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా విత్ డ్రా చేయించి ఇప్పుడు వాగ్దానాలు మరిచి కార్పొరేట్ ఆసుపత్రి ఆబ్జెక్షన్ చెబుతున్నారని కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు. ఇదే మెయిన్ రోడ్డుపై రోడ్డుపై రోడ్డు దాటుతూ ఏడు మంది ప్రాణాలు కోల్పోగా పుట్ ఓవర్ బ్రిడ్జి వేయడానికి సాధ్యం కాదని ఎమ్మెల్యే గాంధీ కార్పోరేట్ ఆసుపత్రికి కొమ్ము కాయడం సబబు కాదన్నారు గడచిన తొమ్మిదేళ్లలో తనకు పార్టీలో ప్రాంతీయ వివక్షత కొనసాగుతుందని,సరైన గుర్తింపు లేక బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీలో జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తన అనుచరులతో పెద్ద ఎత్తున పార్టీ లో చేరామని సిందం శ్రీకాంత్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కేటీఆర్ విస్మరించారని ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్వర్ గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తనతోపాటు రామ్ నరేష్ నగర్ కాలనీ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, రాజిరెడ్డి, నర్సింగ్ రావు ఫసివుద్దీన్, సాదక్,ఎండి ఫయాజ్ రాము ,షకీల్, నాగార్జున రెడ్డి , అశోక్ యాదవ్తో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ఉద్యమకారులను మరిచిన బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్




