తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తెలంగాణ సరస్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిల్లాపాటి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం  సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి నాయకులు స్వీట్ లు పంచుకున్నారు. వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు  బిళ్లపాటి. రాజశేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తెచ్చి సోనియామ్మ  పుట్టినరోజు కానుక అందించరని  ఇకపై తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు జగ్గరి రత్నారెడ్డి ఎస్సీ సెల్ నాయకులు పెండ్యాల అనంతయ్య ఆవుటి రాజశేఖర్ జాఫర్ రెడ్డినాయక్ బందయ్య యాదగిరి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *