తెలంగాణ అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యం

కుల్కచర్ల/చౌడాపూర్, ప్రజాతంత్ర , నవంబర్ 16: చౌడాపూర్ మంలంలోని అడవి వెంకటాపూర్  గ్రామం ధర్మనాయక్ తాండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నుండి 50 మహిళలు, యువకులు మండల అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో ‌బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం అందుకోసం మేమందరం బిజెపిలో చేరామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నర్సోజి, యువ నాయకులు నరేష్,రఘు, రమేష్,మదన్, పార్టీ లో చేరిన వారు రాములునాయక్, సంతొష్,ప్రవిన్ ,గణేష్, హనుమంతు, పాండు,లక్ష్మణ్,తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *