తుగ్లక్‌ ‌నిబంధనలు సవరించండి

పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : తుగ్లక్‌ ‌నిబంధనల పేరిట పోలీస్‌ అభ్యర్థుల జీవితాలతో సర్కార్‌ ‌చెలగాటమాడుతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. ఇప్పటికే పలువురు చనిపోయినా చలనం లేదన్నారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…టీఎస్‌ఎల్‌పీఆర్‌ ‌బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

బోర్డు నిర్వాకంతో లక్షల మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని, పరీక్షల్లోని లోపాలు సవరించాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. లాంగ్‌ ‌జంప్‌తో పాటు షాట్‌పుట్‌ ‌విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *