తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు

తిరుమల, జనవరి 14 : తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద్దారు. తెల్లవారుఝామున మహాద్వారం ముందు భోగిమంటలు వేసి అత్యంత ఆనందంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి పాటలతో టీటీడీ సిబ్బంది, భక్తులు సందడి చేశారు. గోవింద నామ స్మరణ చేస్తూ భోగి మంట చుట్టు నృత్యాలు చేశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో భోగిమంటలు వేసి సంబరాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *