తిరుమలలో టోకెన్లు లేని వారికి శీఘ్ర దర్శనం

తిరుమల, జనవరి 18 : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 5 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలు భాగంగా నవగ్రహ హోమం ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యాహవాచనం, కలశ స్థాపన పూజ, నవగ్రహ ఆవాహనం, అగ్ని ప్రతిష్ట, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *